హయత్ నగర్ డివిజన్ 13, బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి, కళ్లెం నవజీవన్ రెడ్డి ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: నమస్కారం
జవాబు: నమస్కారం
ప్రశ్న: హయత్ నగర్ లో మీ ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?
జవాబు: అద్భుతంగా ఉంది. ప్రజలకు BJP గురించి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. GHMC లో బిజెపి గెలిస్తేనే హయత్ నగర్ డెవలప్ అయితది అని వాళ్లే చెప్తున్నారు.
ప్రశ్న: మీకు ఎందుకు ఓటు వెయ్యాలి?
జవాబు: హయత్ నగర్ ఇంకా ఆగం కావద్దంటే. అధ్వాన్నమై రోడ్లతో ప్రజలు అవస్థలు పడొద్దంటేనాకే ఓటు వెయ్యాలి. కాలనీలకు సరైన సదుపాయాలు, పార్కులు, మెరుగైన డ్రయినేజి కావాలంటే BJP అభ్యర్థినైన నాకు ఓటు వెయ్యాలని కోరుతున్న.
ప్రశ్న: BJP కి ఓటు వేస్తే నగర పౌరుల బతుకులు మారుతాయా?
జవాబు: ఖచ్చితంగా నగర పాలనలో మా పార్టీకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఢిల్లీలో ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా మాదే గెలుపు. దేశం మొత్తం మీద విశాలమైన రోడ్లున్న సిటీ ఒక్క ఢిల్లీ మాత్రమే. ఢిల్లీలో ఉన్న మెరుగైన డ్రయినేజి వ్యవస్థ హైదరాబాద్ లో లేదు. అహ్మదాబాద్ లో ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్ వ్యవస్థను హైదరాబాద్ లో తెస్తామని ఐదేండ్ల కింద KTR చెప్పాడు. అహ్మదాబాద్, నాగ్ పూర్ లో BJP పాలక వర్గాలు చేసిన అభివృద్ధిని కెటిఆర్ ఐదేండ్ల కిందట చూసి వచ్చి, వాటిని కాపీ కొట్టి హైదరాబాద్ ను డెవలప్ చేస్తా అన్నాడు. ఇంత వరకు చెయ్యలేదు.

ప్రశ్న: అంటే మున్సిపల్ కార్పొరేషన్ సిటీస్ ను బాగు చేయడం బిజెపి కే సాధ్యం అంటారా?
జవాబు: అవును. జమ్ము నుంచి బెంగుళూరు వరకు, జైపూర్ నుంచి గౌహతి వరకు, పుణే నుంచి లక్నో వరకు దాదాపు వంద నగర పాలక సంస్థల్లో మేం అధికారంలో ఉన్నాం. మంచి రోడ్లు, డ్రైనేజి, పార్కులు, ప్లేగ్రౌండ్స్, మంచి నీటి సరఫరాతో సహా ఏ విషయంలో ఐనా మేం అధికారంలో ఉన్న నగరాలలోని ప్రజల పరిస్థితి హైదరాబాద్ కంటే చాలా బెటర్ గా ఉంది.
ప్రశ్న: LRS పోవాలంటే ఏం చెయ్యాలి?
జవాబు: TRS ను ఓడిస్తే LRS పోతది.
ప్రశ్న: డబుల్ బెడ్ రూం రావాలంటే?
జవాబు: BJP రావాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా KCR ప్రభుత్వం ఇండ్లు కడతలేదు. మేం అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్షకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం సాధ్యమైతది. మోడీ ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి హామీ ఇచ్చిన పనులు పూర్తి చేయిస్తం. డబుల్ బెడ్రూం మరియు కాలనీలకు మంచి రోడ్లు, ఇతర వసతులు కల్పిస్తాం.
ప్రశ్న: వరద సహాయం సంగతి ఏంటి?
జవాబు: మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే వరద బాధితులకు ఇంటికి పదివేలు ఇచ్చిండ్రు. కానీ ప్రజలకు ఇవ్వకుండా కొందరు నాయకులు, కార్యకర్తలు దోచుకున్నరు. నిజమైన ప్రజలకు మేం న్యాయం చేస్తాం. మా పార్టీ మేయర్ వస్తే ఇంటికి 25 వేల వరద సహాయం తప్పకుండా చేస్తాం. మాది మోడీ గారి నాయకత్వంలో నడిచే పార్టీ. నీతి నిజాయితీకి మారుపేరు లాంటి పార్టీ. కాబట్టి వరద సహాయం డబ్బులను స్వాహా చెయ్యడం జరగదు.
ప్రశ్న: అభివృద్ధి కావాలా అశాంతి కావాలా ఇని KTR అడుగున్నారు
జవాబు: మా తరఫున ఈ ప్రశ్న అడిగినందుకు KTR గారికి థ్యాంక్స్ చెప్తున్న. ఎందుకంటే దేశంలోనే IT లో నంబర్ వన్ బెంగుళూరు సిటీలో 2010 నుంచి మేమే అధికారంలో ఉన్నాం. అక్కడ అశాంతి ఉందా? IT కంపెనీలు భయపడి పారిపోయినయా? తెలంగాణ కన్నా పదింతలు IT అభివృద్ధి జరిగింది బెంగళూరులో. అక్కడ కూడా TRS ఉందనుకుంటుండా KTR? ITలో మూడో ర్యాంకులో ఉన్న పుణేలో కూడా మేమే అధికారంలో ఉన్నాం. పుణే ఇప్పుడు హైదరాబాద్ తో పోటీ పడుతుంది.
ప్రశ్న: మా సంక్షేమ పథకాలకు ఎదురు లేదని TRS వాళ్లు చెప్తున్నారు కదా?
జవాబు: వాళ్లు నోరు తెరిస్తే అబద్ధాలు. ప్రతి పథకానికి మోడీ గారు నిధులు ఇస్తున్నరు. రూపాయి కిలో బియ్యం పూర్తిగా మోడీ ప్రభుత్వమే ఇస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. GHMCలో ప్రతి డబుల్ బెడ్రూం ఇంటికి మోడీ ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది. అయినా ఇంత వరకు రెండు వేల ఇండ్లను కూడా కట్టలేదు. ఆసరా పింఛన్లు, హరితహారం, కెసిఆర్ కిట్, గొర్రెల పంపిణీ, చెరువుల్లో చేపలు రొయ్యల పెంపకం ఇంకా అనేక పథకాలు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే నిరాటంకంగా అమలైతున్నయి. బస్తీ దవాఖానాలకు 60 శాతం మోడీ సర్కార్ నేషనల్ హెల్త్ మిషన్ నిధులు ఇస్తుంది. మోడీ ప్రభుత్వం నిధులు ఇయ్యకపోతే అసలు KCR ప్రభుత్వం ఒక్క రోజు కూడా నడవదు.
ప్రశ్న: హయత్ నగర్ ప్రజలకు మీరు చెప్పదలచుకున్నారు?
జవాబు: హయత్ నగర్ లో నివసించే మనం కూడా మనుషులమే. తెలంగాణ తల్లి బిడ్డలమే. మంచి రోడ్లు, మెరుగైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పిల్లల కోసం పార్కులు, యువత కోసం ప్లేగ్రౌండ్, పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం మన హక్కు.
హైదరాబాద్ అంటే హైటెక్ సిటీయే కాదు. హయత్ నగర్ కూడా. నగరానికి ఓ మూల ఉందని ఈ ప్రాంతాన్ని TRS నిర్లక్ష్యం చేసింది. మూలన ఉన్న, మరుగున పడిన డివిజన్ కాదు, హైదరాబాద్ ప్రగతిక మూల స్తంభంగా దీన్ని తీర్చి దిద్దుకుందాం. కాబట్టే ఆదర్శ హయత్ నగర్ నినాదంతో ముందుకు వస్తున్నాను. ఆదర్శ హయత్ నగర్ ని నిర్మించాలంటే అందరూ నాకు ఓటు వేసి బీజేపీ పార్టీ ని గెలిపించాలని కోరుతున్నాను.