నమస్కారం మేడం
సోషల్: మీరు కూడా ప్రచారం లో తిరుగుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది.
నవీనా రెడ్డి: BJP కి బాగా పాజిటివ్ వేవ్ ఉంది.ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్స్ వల్ల ఎంతో మార్పు వచ్చింది. తెరాస చేస్తున్న అక్రమాలు అన్యాయాలు మీరు చూస్తున్నారు కదా.ఎక్కడికెళ్లినా ఎవరింటికెళ్లిన బీజేపీ కే ఓటు వేస్తామని గట్టిగా చెబుతున్నారు
సోషల్: రీసెంట్ గా మనం రెండు సమస్యలని చూసాము. ఒకటి కరోనా, రెండు వరదలు. ఈ రెండింటి గురించి మేము ఎన్నో చేసాం అని ప్రభుత్వం అయితే గొప్పలు చెపుతుంది. దీని గురించి ప్రజలు లో వ్యతిరేకత ఏమైనా కనిపించిందా?
నవీనా రెడ్డి: వరదల వల్ల నీళ్లు ఇంట్లోకి రావడం, రోడ్స్ డామేజ్ అవ్వడం ఇవే బాగా ప్రాబ్లెమ్స్ ఇవే చూపిస్తున్నారు ఎవరు రావట్లేదు, మా సమస్యలు చెప్పినా వినట్లేదు అని మొత్తం కెసిఆర్ మరియు తెరాస లపై విరక్తి వొచ్చేసింది.
సోషల్: హయత్నగర్ డివిజన్ అంటే చిన్నదేం కాదు చాలా పెద్ద డివిజన్. మీరు మొత్తం తిరిగారు. నవజీవన్ రెడ్డి గారు రావాలనే ఒక వేవ్ అయితే క్రెయేట్ అయింది. ఒకవేళ నవజీవన్ గారు రాజకీయాల్లోకి వస్తే, మొదటి సారి కాబట్టి, ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వగలరు?
నవీనా రెడ్డి: సమస్యలు తీర్చగలుగుతారు. వాళ్ళను face to face కలిసి తెలుకోగల్గుతారు. ఎప్పుడు అందుబాటులో వుంటారు. ఇంటికి వచ్చి అడిగినా సహాయం చేయగలుగుతారు.
సోషల్: అంటే ఇంతకముందు నవ జీవన్ రెడ్డి గారు ఏమైనా.. చేసారా?
నవీనా రెడ్డి: చేసారండి. అందరికీ ఆహరం పెట్టడం డోర్ to డోర్ వెళ్లి ఇంట్లోకి బియ్యం, వెజిటబుల్ ఇవ్వడం లాంటివి కరోనా టైం లో బాగానే చేసారు. మొన్న వరదలు వచ్చినపుడు ఇక్కడే హయత్నగర్ లో బంజారా కాలనీ అని ఉంటుంది. అక్కడ మొత్తం మునిగి మునిగిపోయింది. వాళ్లకు ఫుడ్ లేదు ఎం లేదు వాళ్లకు ఫుడ్ packing చేసి ఇవ్వడం జరిగింది.
సోషల్: అంటే అసలు ఇంత సడెన్ గా జీవన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి?
నవీనా రెడ్డి: సడన్ గా ఎం లేదు ఆయనకు ఎప్పటి నుండో ఉంది సేవ చేయాలనీ. ఈ ఇయర్ grew up అయ్యి రాజకీయాల్లోకి రావాలి అని, ఇంకా ఏదైనా పేరు ఉంటే మంచిగా సేవ చేయగలుగుతాం అని బాగా ట్రై చేస్తున్నారు. ఇది ఇప్పటిదేం కాదు. అయినది చిన్నప్పటి నుండే సేవా గుణం. ఎవ్వరొచ్చినా help చేస్తరు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన చేస్తారు రాకపోయినా చేస్తరు.
సోషల్: ఇప్పటి వరకు బీజేపీ వీక్ గానే కనిపిచింది. కానీ అభ్యర్థి మారాడు వేవ్ మారింది. ఎటువంటి ఫలితం వస్తుందని అనుకుంటున్నారు?
నవీనా రెడ్డి: విన్నింగ్ ఛాన్సెస్ బానే ఉన్నాయండి. ఈ దుబ్బాక ఎలక్షన్ బాగా ప్లస్ పాయింట్ అయింది. ఎవరు చుసిన బీజేపీ బీజేపీ అంటున్నారు. విన్నింగ్ అయితే అవుతారు. తెరాస పైన చాలా వ్యతిరేకత ఉంది.